దాదాపు 4 దశాబ్దాలు వెండితెరపై నటించిన తాను త్వరలో బుల్లితెర (టీవీ)పై కనిపించనున్నానని తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ చెప్పారు. డిస్కవరీ చానెల్ ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమంలో బేర్‌గ్రిల్స్‌తో కలిసి కనిపిస్తానన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమంలో ప్రతికూల పరిస్థితుల్లో ప్రముఖులెలా స్పందిస్తారన్న దాన్ని బేర్‌గిల్స్ పరీక్షించాడని చెప్పారు. తాను ఇప్పుడు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధమన్నారు. స్ఫూర్తిదాయక నిజ జీవితమంటే ఇదేనని తెలిపారు.
స్ఫూర్తిదాయక జీవితమంటే ఇదే: రజినీకాంత్