రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో విద్యార్థులకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని తప్పనిసరిచేస్తూ జేఎన్టీయూహెచ్ నిర్ణయం తీసుకున్నది. అన్ని కాలేజీలు ఈ నిబంధనను పాటించాలని.. లేకుంటే అఫిలియేషన్‌కు అవకాశం ఉండదని పేర్కొన్నది. మంగళవారం జేఎన్టీయూహెచ్ ఇంచార్జి వీసీ జయేశ్‌రంజన్ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఏఐసీటీఈ నిబంధనలపై చర్చించారు. ఇప్పటికే బీటెక్, బీఫార్మసీ కాలేజీల్లో టీచింగ్ ఫ్యాకల్టీకి, పీజీ కాలేజీల్లో ఫ్యాకల్టీతోపాటు విద్యార్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలుపరుస్తున్నామని చెప్పారు.
బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి