ప్రభుత్వ ఆదేశాలు దిక్కరిస్తే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల రాజన్న జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసమే లాక్‌డౌన్ ఆదేశాలు జారీ చేశాం. టూ వీలర్‌పై ఒక్కరు, ఫోర్ వీలర్‌పై ఇద్దరికి మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీరు కూడా అత్యవరస పరిస్థితి ఉంటేనే బయటకు రావాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించకుండా రోడ్లపైకి బండ్లపై వస్తే వాటిని అక్కడికక్కడే సీజ్ చేస్తామని, అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.
సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ప్రజలు ఎవరూ బయటకు రావొద్దన్నారు. సోషల్ డిస్టెంట్స్ పాటిస్తేనే వైరస్‌ను నిరోదించగలుగుతామని వెల్లడించారు. చట్టాలను ఉల్లంఘించిన వారు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఇంటి నుంచి బయటకు వస్తే వైద్య సిబ్బందికి, 104కు ఫోన్ చేసి చెప్పాలని, వారి పాస్‌పోర్టు రద్దు చేయబడుతుందని తేల్చి చెప్పారు.